భారత్ శ్రీలంక మధ్య తొలి వన్దే ప్రారంభమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్.. వన్డేల్లోనూ లంకపై ఆధిపత్యం చూపించి సిరీస్ గెలవాలని చూస్తుంది. మూడు వన్డే సిరీస్ లో భాగంగా నేడు తొలి వన్డేలో గెలిచి ఇరు జట్లు బోణీ కొట్టాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో తుది జట్టులో పంత్ కు చోటు లభించలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ గా సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్ లో భారత్ ముగ్గురు ఆల్ రౌండర్లతో బరిలోకి దిగుతుంది. అక్షర్ పటేల్, వాషింగ్ టన్ సుందర్ లతో పాటు దుబేకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది. మరో వైపు శ్రీలంక తరపున ఫాస్ట్ బౌలర్ సిరాజ్ తొలి వన్దే ఆడనున్నాడు.
శ్రీలంక (ప్లేయింగ్ XI):
పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), జనిత్ లియానాగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, అకిల దనంజయ, అసిత ఫెర్నాండో, మహ్మద్ షిరాజ్
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్