సిల్హెట్: బంగ్లాదేశ్‌తో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో శ్రీలంక తడబడి కోలుకుంది. ధనంజయ డిసిల్వా (102), కామిందు మెండిస్ (102) సెంచరీలతో చెలరేగడంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో 280 రన్స్‌కు ఆలౌటైంది. బంగ్లా బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నిషాన్ మధుషక (2), దిముత్ కరుణరత్నె (17), కుశాల్ మెండిస్ (16), మాథ్యూస్ (5), దినేశ్ చండిమల్ (9) ఫెయిల్ కావడంతో లంక 57 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో డిసిల్వా, కామిందు ఆరో వికెట్‌కు 202 రన్స్ జోడించి ఆదుకున్నారు. 5 రన్స్ తేడాతో ఈ ఇద్దరూ ఔట్ కాగా, మరో 78 రన్స్ జత చేసి చివరి మూడు వికెట్లను కోల్పోయింది. కాలీద్ అహ్మద్, నషీద్ రాణా చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 32/3 స్కోరు చేసింది. హసన్ జాయ్ (9*), తైజుల్ ఇస్లామ్ (0*) క్రీజులో ఉన్నారు. జాకీర్ హసన్ (9), నజ్ముల్ (5), మొమినల్ హక్ (5) విఫలమయ్యారు.