దంబుల్లా: ఆసియా కప్‌లో ఎనిమిదో టైటిల్‌పై గురి పెట్టిన ఇండియా విమెన్స్ టీమ్‌కు శ్రీలంక షాకిచ్చింది. చామరి ఆటపట్టు (61), హర్షిత సమరవిక్రమ (69 నాటౌట్) చెలరేగడంతో తొలిసారి ఆసియా కప్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్‌లో లంక 8 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించింది. ఆసియా కప్ తొమ్మిది ఎడిషన్ల (వన్డే / టీ20)లో టీమిండియా ఓడటం ఇది రెండోసారి. 2018 ఫైనల్లో ఇండియా.. బంగ్లాదేశ్ చేతిలో పరాజయంపాలైంది.
టాస్ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 165/6 స్కోరు చేసింది. స్మృతి మంధాన (60),, రిచా ఘోష్ (30) రాణించారు. తర్వాత చామరి, హర్షిత జోరుతో లంక 18.4 ఓవర్లలోనే 167/2 స్కోరు చేసి గెలిచింది. చామరితో రెండో వికెట్‌కు 87, కావిషా (30 నాటౌట్)తో మూడో వికెట్‌కు 73 రన్స్ జోడించిన హర్షిత లంకు టైటిల్‌ను అందించింది. హర్షితకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, చామరికి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు లభించాయి.