RCB ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌ బై

RCB ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌ బై

పరిమిత ఓవర్ల క్రికెట్ మోజులో పడి శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ కీలక ఆటగాడు వనిందు హసరంగా(Wanindu Hasaranga) సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అతను ఇప్పటికే శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు వెల్లడించారు. మంగళవారం (ఆగస్టు 15) హసరంగా టెస్టు క్రికెట్ కి రిటైర్మెంట్ అవుతున్నట్లుగా ప్రకటించారు. వైట్ బాల్‌ క్రికెట్‌పై మరింత దృష్టిపెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డుకు అతను తెలియజేశారు.

ALSO READ :స్పెషల్ ఫ్లైట్‌లో ఐర్లాండ్‌కు భారత క్రికెటర్లు

 26 ఏళ్లకే గుడ్ బై

ఇప్పటివరకూ కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన హసరంగా.. 4 వికెట్లు పడగొట్టారు. డిసెంబర్ 2020లో దక్షిణాఫ్రికాతో జరిగిన అరంగేట్రం చేసిన అతను.. 2021 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌తో చివరి టెస్టు ఆడారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బెస్ట్ స్పిన్నర్‌గా పేరొందిన హసరంగా.. టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఈ క్రమంలోనే ఊహించని నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ ఆష్లే డి సిల్వా మాట్లాడుతూ.. తాము హసరంగా నిర్ణయాన్ని గౌరవిస్తామని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం తమకు ఉందని  తెలిపారు.

టీ20ల్లో నెంబర్.1 బౌలర్‌

రెడ్ బాల్ క్రికెట్‌లో సత్తా చాటులేకపోయిన హసరంగా.. వన్డే, టీ20ల్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. టీ20ల్లో నెంబర్.1 బౌలర్‌గా ఎదిగిన అతను.. ప్రస్తుతం టీ20ల్లో మూడో ర్యాంక్‌లో ఉన్నారు. ఇప్పటివరకు 58 టీ20ల్లో హసరంగా 15.8 సగటుతో 91 వికెట్లు పడగొట్టారు.  అలాగే 48 వన్డేల్లో 28.78 సగటుతో 67 వికెట్లు పడగొట్టారు. ఇటీవల ముగిసిన ఐసీసీ వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ లో హసరంగా అద్భుతంగా రాణించారు. 22 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచారు.