సొంతగడ్డపై శ్రీలంక జట్టు భారత్ కు ఆతిధ్యమివ్వనుంది. ఇందులో భాగంగా భారత్, శ్రీలంక జట్లు 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ తో పాటు 3 వన్డేలు ఆడనుంది. ఇప్పటికే భారత్ టీ20, వన్డే జట్టును ఎంపిక చేయగా.. తాజాగా శ్రీలంక క్రికెట్ టీ20 సిరీస్ కు 16 మందితో కూడిన స్క్వాడ్ ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత శ్రీలంకకు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. వెస్టిండీస్, అమెరికా ఆతిధ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో లంక గ్రూప్ దశ దాటలేక ఇంటిదారి పట్టింది.
ఆల్ రౌండర్ హసరంగా టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో అసలంకను లంక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అసలంక ఇటీవల లంక ప్రీమియర్ లీగ్ లో జాఫ్నా కింగ్స్‌ను టైటిల్ అందించడంతో లంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. జట్టులో అనుభవంతో పాటు యువ ఆటగాళ్లకు చోటు లభించింది. అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, దసున్ షనక అనుభవంతో పాటు యువ స్టార్ క్రికెటర్లు దునిత్ వెల్లలాగే,మతీషా పతిరానాలకు స్క్వాడ్ లో ఎంపికయ్యారు.
ఆల్ రౌండర్ చమిందు విక్రమసింఘేకు తొలిసారి జట్టులో స్థానం దక్కింది. పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, దినేష్ చండిమాల్ లాంటి సీనియర్ ప్లేయర్లను సెలక్ట్ చేశారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో భారత్, శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొదటి టీ20 జూలై 27న జరగనుండగా.. చివరి రెండు మ్యాచ్‌లు వరుసగా జూలై 28, 30న జరుగుతాయి. టీ20 సిరీస్ అనంతరం ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.
భారత్ సిరీస్ కోసం శ్రీలంక టీ20 జట్టు
చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, డి నుష్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీమ్‌వన్ విక్రమసింఘే, ఫెర్నాండో