శ్రీలంక వెళ్లాలనుకుంటే ఇదే మంచి టైం.. టూరిస్టులకు వీసా ఫ్రీ ఎంట్రీ

శ్రీలంక వెళ్లాలనుకుంటే ఇదే మంచి టైం.. టూరిస్టులకు వీసా ఫ్రీ ఎంట్రీ

నేచర్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి, విదేశాలను సందర్శించాలనుకునే వారికి ఇదో శుభవార్తే అని చెప్పాలి. ఐలాండ్ కంట్రీ అయిన శ్రీలంకలో టూరిజం స్పార్ట్స్ బానే ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి వీసా లేకుండానే భారతీయులు శ్రీలంకకు వెళ్లొచ్చు.. శ్రీలంక దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీ సంబంధాలు బలోపేతం చేయడానికి వీసా ఫ్రీ ఎంట్రీ దేశాల సంఖ్య పెంచింది. భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్‌తో సహా 35 దేశాల పౌరులకు వీసా-రహిత ప్రవేశాన్ని కల్పిస్తూ శ్రీలంక ప్రభుత్వ నిర్ణయించుకుంది.

ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ మరియు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు కూడా వీసా లేకుండా శ్రీలంక దేశంలోకి రావచ్చని ప్రకటించింది. 2023లో ప్రారంభించబడిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో విస్తరించింది. శ్రీలంకలో మంచి టూరిజం ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ఈ 5 ప్రదేశాల గురించి తెలుసుకోవాల్సిందే.

  • సిగిరియా: ది లయన్స్ రాక్
  • యాలా నేషనల్ పార్క్: వైల్డ్ లైఫ్ హెవెన్
  • గాలే: యునెస్కో ప్రపంచ వారసత్వ నగరం
  • నువారా ఎలియా: ఒక హిల్ స్టేషన్ రిట్రీట్
  • కాండీ: శ్రీలంక సాంస్కృతిక రాజధాని