SL vs NZ 2024: శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్‌కు నేడు బ్రేక్.. కారణం ఏంటంటే..?

SL vs NZ 2024: శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్‌కు నేడు బ్రేక్.. కారణం ఏంటంటే..?

శ్రీలంక, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ కు బ్రేక్ పడింది. తొలి మూడు రోజులు ఈ మ్యాచ్ జరగగా.. నాలుగో రోజు ఇరు జట్లకు రెస్ట్ ఇచ్చారు. దేశంలో అధ్యక్ష ఎన్నికల కారణంగా శనివారం (సెప్టెంబర్ 21) మ్యాచ్ జరగడం లేదు. దీంతో ఈ రోజును విశ్రాంతిగా ప్రకటించారు. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు జరుగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే అధికారికంగా తెలియజేసింది. 

తొలి మూడు రోజులు మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత 22, 23 తేదీల్లో మ్యాచ్ కొనసాగుతుంది. రెండో టెస్ట్ యధావిధిగా 5 రోజుల్లోనే జరుగుతుంది. చివరిదైన రెండో టెస్ట్ సెప్టెంబర్ 26న ప్రారంభం కానుంది. వరల్డ్  ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకంగా మారనుంది. టెస్ట్ మ్యాచ్ ఆరు రోజులు జరగడం ఇదే తొలిసారి కాదు. ఇంగ్లండ్‌లో అనేక మ్యాచ్‌లు ఆరు రోజుల పాటు జరిగాయి. 

ALSO READ | IND vs BAN 2024: సెంచరీలతో దంచి కొట్టిన గిల్, పంత్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 305 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 340 పరుగులు చేసి 35 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 237 పరుగుల వద్ద రేపు బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 202 పరుగుల ఆధిక్యలో ఉంది.