Women's T20 World Cup: 23 పరుగులకే ప్రత్యర్థి ఆలౌట్.. లంక మహిళల భారీ విజయం

అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక మహిళా జట్టు బోణీ కొట్టింది. ఆదివారం(జనవరి 19) ఆతిథ్య మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 139 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత లంక మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేయగా.. ఛేదనలో మలేషియా జట్టు 23 పరుగులకే ఆలౌటైంది.

సనేత్మా హాఫ్ సెంచరీ

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్ సంజనా కవిందీ (13 బంతుల్లో 30) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. వన్ డౌన్ బ్యాటర్ దహామి సనేత్మా (52 బంతుల్లో 55) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడింది. చివరలో హిరుణి హన్సిక (21 బంతుల్లో 28) విలువైన పరుగులు చేసింది.

Also Read :- లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్

అనంతరం చేధనకు దిగిన మలేషియా మహిళలు 23 పరుగులకే కుప్పకూలారు. ఏకంగా అరుగులు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. నూర్ అలియా హైరున్(7 పరుగులు) టాప్ స్కోరర్. లంక బౌలర్లలో స్పిన్నర్ చామోడి ప్రభోద తన 4 ఓవర్లలో 5 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. లిమాన్స తిలకరత్న, మనుడి నానయక్కరా రెండేసి వికెట్లు చొప్పున తీశారు.