- వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన శ్రీలంక క్రికెటర్‌గా ఘనత
పల్లెకెలె: శ్రీలంక బ్యాటర్ పాథుమ్ నిశాంక (139 బాల్స్‌లో 20 ఫోర్లు, 8 సిక్స్‌లతో 210 నాటౌట్) అరుదైన ఘనత సాధించాడు. లంక తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. దాంతో 2000లో ఇండియాపై జయసూర్య (189) నెలకొల్పిన హయ్యెస్ట్ స్కోరు రికార్డును బ్రేక్ చేశాడు. నిశాంకకు తోడుగా బౌలింగ్‌లో ప్రమోద్ మధుషన్ (4/75) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో లంక 42 రన్స్ తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 లీడ్‌లో నిలిచింది. టాస్ ఓడిన లంక 50 ఓవర్లలో 381/3 స్కోరు చేసింది. ఆవిష్క ఫెర్నాండో (88), సమరవిక్రమ (45) కూడా రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 339/6 స్కోరు చేసింది. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (149 నాటౌట్), మహ్మద్ నబీ (136) సెంచరీలతో చెలరేగినా టీమ్‌ను గెలిపించలేకపోయారు. నిశాంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.