
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సొసైటీ, మహిళా స్వకృషి డెయిరీని మంగళవారం శ్రీలంకకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. ఎన్ఐఆర్డీ ఈనెల17 నుంచి 21 వరకు సహకార సంస్థల పాత్రపై అంతర్జాతీయ సదస్సులో కార్యక్రమ అధ్యయనంలో భాగంగా శ్రీలంక దేశ కోఆపరేటివ్బృంద సభ్యులు ముల్కనూర్‌లో పర్యటించినట్లు వారు తెలిపారు. రైతులు, మహిళలు స్వయం కృషితో ఎదిగిన తీరు, సంస్థ అభివృద్ధి తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. కార్యక్రమంలో ముల్కనూర్ సొసైటీ అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, డెయిరీ అధ్యక్షురాలు ధనశ్రీ, జీఎం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.