![సాగర్ ను సందర్శించిన శ్రీలంక టూరిజం ప్రమోటర్స్](https://static.v6velugu.com/uploads/2025/02/sri-lankan-tourism-promoters-visited-the-international-tourist-centre-nagarjuna-sagar_eKa9wCSJq1.jpg)
హాలియా, వెలుగు: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను బుధవారం శ్రీలంక టూరిజం ప్రమోటర్స్ సందర్శించారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను శ్రీలంక దేశంలో ప్రమోట్ చేయడానికి ఆ దేశపు టూరిజం, ట్రావెల్ ప్రతినిధులు నాగార్జునసాగర్ కు వచ్చారు.
ఈ సందర్భంగా ఈ బృందం టూరిజం లాంచీలో నాగార్జున కొండకు చేరుకొని అక్కడ మ్యూజియాన్ని, సింహాల విహారం, మహా స్థూపాన్ని సందర్శించారు. ఇక్కడి నుంచి వరంగల్, హనుమకొండ లోని చారిత్రక ప్రదేశాలను ,దేవాలయాలను సందర్శిస్తామని తెలిపారు. వారి వెంట బుద్ధవనం ఈవో శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, అసిస్టెంట్ మేనేజర్ సాయిరాం, శ్రీలంక ఎయిర్లైన్స్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.