నేటి నుంచి మహాలక్ష్మి యాగం

నేటి నుంచి మహాలక్ష్మి యాగం

దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఆర్​కే పురం అష్టలక్ష్మి దేవాలయంలో ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు శ్రీమహాలక్ష్మి యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ గౌరిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, చైర్మన్ సోమ సురేశ్​గుప్తాలు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో యాగం పోస్టర్లను ఆవిష్కరించారు. యాగానికి లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాగంలో భాగంగా 300 మంది మహిళలు కలశాలతో శోభాయాత్ర ఉంటుందని చెప్పారు. ఆలయ ప్రధాన కార్యదర్శి జగన్, కోశాధికారి అంజయ్య గుప్తా పాల్గొన్నారు.