కామేపల్లి, వెలుగు : మండలంలోని కొమినేపల్లి, కొండాయిగూడెం, పండితాపురంలో శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఊరేగింపు గురువారం వైభవంగా కొనసాగింది. మహిళలు కోలాటాలు ఆడారు. అధిక సంఖ్యలో మహిళలు హారతులు ఇచ్చారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీపార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఊరేగింపు కొనసాగింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు డీసీసీబీ డైరెక్టర్ మేకల మళ్లిబాబు యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బోడేపూడి విఠల్ రావు, భానోత్ నరసింహ నాయక్, మేకల మల్లికార్జున్ రావు, గుంటుపల్లి వెంకట్రావు, మేకపోతుల మహేశ్, మేకల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.