
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల తిరుమల థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ ను ఎమ్మెల్సీ కే శంకర్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు.
నల్గొండ మున్సిపాలిటీ వ్యాపార పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, రాఘవేంద్ర ఫ్రాంచెస్ నందకిషోర్, ప్రొప్రైటర్ దుగ్యాల సృజన్ కుమార్, బొడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు.