భక్తులతో కిక్కిరిసిన వేములవాడ

భక్తులతో కిక్కిరిసిన వేములవాడ
  • స్వామి వారి దర్శనానికి 5 గంటలు
  • కోడె మొక్కుల కోసం బారులుదీరిన భక్తులు

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం శివనామస్మరణతో మారుమ్రోగింది. శ్రావణ మాసం రెండో సోమవారం కావడంతో తెలంగాణతో ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

రద్దీ ఎక్కవగా ఉండడంతో స్వామి వారి దర్శనానికి ఐదు గంటల టైం పట్టిందని భక్తులు తెలిపారు. కోడె మొక్కులు చెల్లించేందుకు భక్తులు బారులుదీరారు. మరో వైపు ఉదయం అర్చకులు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రేక్‌‌‌‌‌‌‌‌ దర్శనం క్యూలైన్లను ఈవో వినోద్‌‌‌‌‌‌‌‌రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలకుండా చర్యలు తీసుకోవాలని ఏఈవో రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు, ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ రాజన్‌‌‌‌‌‌‌‌ బాబు, సూపరిండెంట్‌‌‌‌‌‌‌‌ తిరుపతిరావుకు సూచించారు.