వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

ఖానాపూర్, వెలుగు :  ఖానాపూర్  మండలం మస్కాపూర్ లో శ్రీ రాజరాజేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ప్రతిష్ఠించే విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం, నాగ సుబ్రహ్మణ్య పూజలు, హవనం, ఏకాదశ రుద్ర హోమాన్ని అర్చకులు నిమ్మగడ్డ సందీప్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

నిర్మల్ ఏరియా ఆసుపత్రి  ఆర్ఎంవో డాక్టర్ వేణు గోపాల కృష్ణ దంపతులు సూర్యయాగం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు  దోనికేని దయానంద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు బాషెట్టి నర్సయ్య, నాయకులు జిల్లా శ్రీనివాస్, మల్లయ్య, నాగమ్మ, విజేందర్, శివ, మధు, నితీశ్, మహేశ్, వెంకట్ రాములు పాల్గొన్నారు.