బీజేపీలో రాముడి లొల్లి.. రాజాసింగ్ vs కిషన్ రెడ్డి

బీజేపీలో రాముడి లొల్లి.. రాజాసింగ్ vs కిషన్ రెడ్డి
  •  అంబర్ పేట నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి శోభాయాత్ర
  • తనకు పోటీగా పెట్టిస్తున్నారన్న గోషామహల్ ఎమ్మెల్యే
  • హిందువుల ఐక్యతను చాటడమే తన లక్ష్యమని వెల్లడి
  •  గౌతం రావుకు టికెట్ కేటాయింపుపైనా అసంతృప్తి
  • బీజేపీలో ముదురుతున్న వివాదం

హైదరాబాద్: బీజేపీలో రాముడి వివాదం నడుస్తోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య వివాదం రోజు రోజుకూ పెరిగిపోతోంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావును ప్రకటించడంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనప్పుడల్లా పరోక్షంగా కిషన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. గులాంగిరి చేసేటోళ్లకే పోస్టులు, టికెట్లు ఇస్తారా..? అని పేర్కొన్నారు. 

►ALSO READ | కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనయ్​..మజ్లిస్​ను గెలిపించేందుకే ఎమ్మెల్సీ పోటీకి దూరం: కేంద్ర మంత్రి బండి సంజయ్

అన్ని పదవులూ మీ (సికింద్రాబాద్) పార్లమెంటు నియోజకవర్గానికే ఇస్తారా..? అంటూ కామెంట్ చేశారు. మిగతా సెగ్మెంట్ లో బీజే సీనియర్లు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. అదే సమయంలో రాజాసింగ్ ఓ ఫ్లెక్సీని విడుదల చేశారు. తాను ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా నగరంలో శోభాయాత్ర నిర్వహిస్తానని, ఈ సారి గౌతం రావు ఆధ్వర్యంలో  అంబర్ పేట నుంచి మరో యాత్ర చేయిస్తున్నారని పేర్కొన్నారు. తనకు పోటీగానే ఈ శోభాయాత్ర పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే గౌతం రావుకు టికెట్ కేటాయించారని పేర్కొన్నారు.  తన ఉద్దేశం హిందువుల ఐక్యతను చాటడమని అన్నారు. తాను ప్రతి ఏటా నిర్వహించే శోభాయాత్రను నిర్వీర్యం చేసేందుకే మరో యాత్ర పెట్టిస్తున్నారంటూ పేర్కొన్నారు. ‘మీరు కాదు మీ అయ్యలు వచ్చినా నా దగ్గరికి వచ్చే రామ భక్తులను ఆపలేరు’ అంటూ కామెంట్ చేశారు.