
- ప్రతి పండుగ నాడు కొన్ని ప్రత్యేకమైన రెసిపీలు చేయడం సంప్రదాయం. అలాగే ఈ రోజు జరుపుకుంటోన్న
- శ్రీరామనవమికి కూడా వర్తిస్తుంది. అయితే ఇదే పండుగకువేర్వేరు ప్రాంతాల్లో వివిధ రుచులతో వెరైటీ రెసిపీలు చేస్తారు.
- వాటిలో ఓ మూడు రెసిపీలు పండుగ సందర్భంగా మీకోసం...
వెలగ పానకం
కావాల్సినవి: వెలగపండు – ఒకటి
నీళ్లు – నాలుగు కప్పులు
బెల్లం పొడి – నాలుగు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి, యాలకుల పొడి – ఒక్కోటి పావు టీస్పూన్
తయారీ :
వెలగ పండు గుజ్జును ఒక జల్లెడలో వేయాలి. కింద ఒక గిన్నె ఉంచి దానిపై జల్లెడ పెట్టాలి. జల్లెడలో నీళ్లు పోస్తూ స్పూన్‌తో గుజ్జును కదుపుతూ రసాన్ని బయటకు తీయాలి. అలా తీసిన రసంలో బెల్లం పొడి, మిరియాల పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని గ్లాసులో పోసుకుని పుదీనాతో గార్నిష్ చేస్తే పానకం రెడీ.
కోసంబరి
కావాల్సినవి:
పెసరపప్పు, కొబ్బరి తురుము – పావు కప్పు
క్యారెట్స్, కీరదోస తరుగు – ఒక్కో కప్పు
మామిడి తరుగు – ముప్పావు కప్పు
ఉప్పు – సరిపడా
పచ్చిమిర్చి – రెండు
నిమ్మరసం –
ఒక టీస్పూన్కొ
త్తిమీర – కొంచెం
తయారీ :
పెసరపప్పును కడిగి,
నీళ్లు పోసి అరగంటసేపు
నానబెట్టాలి. క్యారెట్ తొక్క తీసి సన్నగా తురమాలి. కీరదోస కూడా తొక్క తీసి, చిన్న ముక్కలుగా తరగాలి. ఒక గిన్నెలో క్యారెట్ తురుము, కీరదోస, మామిడి ముక్కలు వేయాలి. అందులో నానబెట్టిన పెసరపప్పు కూడా వేసి కలపాలి. తర్వాత ఉప్పు, కొబ్బరి తురుము వేసి నిమ్మరసం, కొత్తిమీర చల్లాలి. అవన్నీ బాగా కలిశాక కాసేపు ఫ్రిజ్‌లో ఉంచితే కూల్ కోసంబరి తినొచ్చు.
ధనియా లడ్డు
కావాల్సినవి:ధనియాల పొడి,
చక్కెర, కొబ్బరి పొడి – ఒక్కో కప్పు
బాదం, పిస్తా, జీడిపప్పు, నెయ్యి – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు – అర కప్పు
తయారీ :
పాన్‌లో నెయ్యి వేడి చేసి బాదం, పిస్తా, జీడిపప్పులను వేగించి పక్కన పెట్టాలి. తర్వాత ఒక్కోటిగా వేగించాలి.. మొదట నెయ్యి వేడి చేసిన పాన్‌లో ధనియాల పొడి వేసి మూడు నిమిషాలు వేగించాలి. తర్వాత నెయ్యి లేకుండా కేవలం కొబ్బరి పొడి వేసి వేగించాలి. ఈ రెండింటినీ వేర్వేరుగా వేగించి పక్కన పెట్టిన తర్వాత, చక్కెర వేసి నీళ్లు పోయాలి. చక్కెర కరిగాక మరో రెండు నిమిషాలు మరిగించాలి. ఆపై ఒక గిన్నెలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, వేగించిన బాదం, జీడిపప్పు, పిస్తాతోపాటు చక్కెర పాకాన్ని కూడా వేసి కలపాలి. చివరిగా ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకుని లడ్డూలు చేయాలి.