భైంసాలో శ్రీ రాముని శోభాయాత్ర..భారీగా పోలీసు బందోబస్తు

  • ఏర్పాట్లు పూర్తి చేసిన హిందూవాహిని


భైంసా, వెలుగు : భైంసాలో శ్రీరాముని శోభాయాత్ర గురువారం జరుగనుంది. దీని కోసం హిందూవాహిని పట్టణ శాఖ నాయకులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. శ్రీరాముని భారీ విగ్రహాన్ని రెడీ చేశారు. ఉదయం 9గంటలకు పురాణ బజార్​లోని గోశాల నుంచి రాముని శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి రాంలీలా గ్రౌండ్​ వరకు కొనసాగనుంది. పురాణ బజార్, దాస్​ హనుమాన్​ టెంపుల్​, గణేశ్​​ నగర్​, గోల్డ్​ మార్కెట్​, గాంధీ గంజ్​, బస్టాండ్​ మీదుగా పిప్రి కాలనీల నుంచి శోభాయాత్ర వెళ్తుంది. 

బందోబస్తు...

శ్రీరాముని శోభాయాత్ర సందర్భంగా పోలీసు శాఖ అలర్ట్​ అయ్యింది. జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్​, ఏఎస్పీ కాంతిలాల్​ పాటిల్​ నేతృత్వంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
ఇప్పటికే అతి సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్​లు పెట్టారు. సుమారు 400 మంది పోలీసులు ఈ బందోబస్తులో ఉండనున్నారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కంట్రోల్​ రూం నుంచి ఎప్పటికప్పుడు యాత్రను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.