
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ చైర్మన్ గెస్ట్ హౌజ్ఎదురుగా వేదికను నిర్మించారు. ఉదయం 11.55 గంటలకు సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం జరగనుంది.
ఈ వేడుకకు లక్ష మందికిగా పై గా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. పూర్ణహుతి, రాత్రి రథోత్సవం, అనంతరం వసంతోత్సవం నిర్వహించనున్నారు. రాముడి కల్యాణం కోసం తలంబ్రాలు, ముత్యాలను జోగినిలు తీసుకువస్తారు.