
ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ రామ మఠంలో ఆదివారం శ్రీ రామ నవమి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ మఠంలో ప్రతీ ఏటా ఉగాది రోజు నుండి శ్రీరామ నవమి వరకు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ . ఈ ఉత్సవాలను ఉగాది రోజు మొదలు ఏప్రిల్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆదివారం వినాయక పూజ, అఖండ దీపారాదన, దేవతలకు అభిషేకం, నూతన వస్తాదారణ తో పాటు రామ మఠంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు.