వేములవాడలో శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభం

వేములవాడలో శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభం

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు మంగళవారం  ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సీతారామ చంద్రస్వామికి పంచోపనిషత్ ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి 9 రోజుల పాటు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 17న సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది.  తొలి రోజు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పురవీధుల్లో హంస వాహనంపై పార్వతీ రాజరాజేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి ఉత్సవమూర్తులను ఊరేగించారు.  

రాజన్న క్షేత్రంలో ఉగాది వేడుకలు.. 
 

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు. ఉదయం నుంచే క్యూలెన్లలో గంటల తరబడి వేచిఉన్నారు. ఆలయంలోని ఓపెన్​ స్లాబ్‌‌లో ప్రధాన అర్చకుడు శరత్​శర్మ  పంచాంగ శ్రవణం వినిపించారు. అనంతరం  వేద పండితులను ఆలయ అధికారులు ఘనంగా సన్మానించారు.  పంచాగ శ్రవణంలో ప్రభుత్వ విప్‌‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ పాల్గొన్నారు.