- ఉమ్మడి వరంగల్జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
- మార్మోగిన జైశ్రీరామ్ నినాదం
- వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు,
- ప్రజాప్రతినిధులు, అధికారులు
కమనీయం.. కడురమణీయం.. సీతారాములs కల్యాణం.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదంతో కల్యాణ వేదికలు మార్మోగాయి. ఆయా వేడుకల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు పలువురు ప్రజాప్రతినిధులు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
వేదపండుతుల ఆధ్వర్యంలో జరిగిన కల్యాణతంతు అంగరంగవైభవంగా సాగింది. అనంతరం అన్నదానాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం పలుచోట్ల శోభాయాత్ర నిర్వహించారు. రామనామస్మరణతో సాగిన ఈ యాత్ర ఎంతగానో ఆకట్టుకున్నది. - వెలుగు, నెట్వర్క్