భద్రాద్రి రామయ్య ఎదుర్కోలు ఉత్సవం..పోటెత్తిన భక్తులు

భద్రాద్రి రామయ్య ఎదుర్కోలు ఉత్సవం..పోటెత్తిన భక్తులు

భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరుగుతోంది.రాములోరిని చూడటానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి స్వామి వారికి కల్యాణ తలంబ్రాలతో పాదయాత్రగా భక్తులు భద్రాచలం చేరుకుంటుండటంతో భక్తాద్రిగా మారింది. పాదయాత్రగా శిరస్సుపై తలంబ్రాలను తీసుకుని ఆలయానికి చేరుకుని స్వామికి సమర్పించారు. క్యూలైన్లలో భక్తులు కిటకిటలాడారు. సీతారామయ్య దర్శనం కోసం భక్తులు వేచి చూశారు. 

ఏప్రిల్ 6న మిథిలాస్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొస్తున్నారు. స్టేడియంలో సెక్టార్లు ఏర్పాటు చేసి పొగమంచు యంత్రాల ద్వారా చల్లదనం కల్పిస్తున్నారు. 2.50లక్షల లడ్డూలు భక్తుల కోసం సిద్ధం. చేశారు. 2.50 క్వింటాళ్ల తలంబ్రాలను కూడా భక్తులకు పంపిణీ చేసేందుకు 80 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు క్యూఆర్ కోడ్ ద్వారా భక్తులకు కల్పించే సదు పాయాలను తెలియజేసేలా ఫ్లెక్సీలు ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేశారు. పట్టాభిషేకానికి 7వ తేదీన గవర్నర్ జిష్ణుదేవ్ పర్మ వస్తున్నారు. లోక కల్యాణంగా భావించే రాములోరి కల్యాణానికి దక్షిణ అయోధ్య భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.