ఏప్రిల్​10న ఎములాడలో రాములోరి పెండ్లి

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్​ 2 తేదీ నుంచి 10 తేదీ వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. 10న ఉదయం 11 :50 నిమిషాలకు కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం రథోత్సవం, డోలోత్సవం నిర్వహిస్తారు.  కల్యాణానికి సుమారు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.  ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న శివపార్వతులు, హిజ్రాలు, జోగినులు తరలివస్తారు. 

ఫ్రీగా ప్రసాదం, దద్దోజనం 

కల్యాణం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఈఓ రమాదేవి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడారు. సీతారాముల పెండ్లి సందర్భంగా భక్తులకు కూర్చున్న చోటికే నీళ్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే ఉచితంగా ప్రసాదం, దద్దోజనం ఇస్తామన్నారు. 9 తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూగా ఆలయం తెరిచి దర్శనం కల్పిస్తామన్నారు.