
పద్మారావునగర్, వెలుగు: కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీవిజయేంద్ర సరస్వతి స్వామీజీ గత నెల 27న తిరుపతిలో ప్రారంభించిన శ్రీరామ యంత్ర రథయాత్ర గురువారం రాత్రి పద్మారావునగర్‌లోని స్కందగిరి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుంది. యంత్రాన్ని ఆలయ కల్యాణ మండపంలో ఉంచి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. వందల మంది భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం పద్మారావునగర్‌లో యంత్రంతో రథయాత్ర నిర్వహించారు. ఆలయ చైర్మన్, మాజీ ఐఏఎస్ఆఫీసర్ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆలయ మేనేజింగ్ ట్రస్టీ కృష్ణన్రాజమణి, చిలకలగూడ సీఐ జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. తిరుపతిలో ప్రారంభమైన శ్రీరామ యంత్ర రథయాత్ర ఐదు రాష్ట్రాల మీదుగా సాగి, ఈ నెల 16న అయోధ్య క్షేత్రానికి చేరుకుంటుంది. -----------