
భద్రాచలం : సీతారాముల కల్యాణం ఆదివారం భద్రాచలంలో వైభవంగా జరిగింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో ఘనంగా కల్యాణోత్సవం నిర్వహించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ వేడుకకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ డ్డి పట్టువస్త్రా లు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముం దుగా ఉదయం గర్భగుడిలో ధృవమూర్తు లకు కల్యాణం జరిగింది. తర్వాత ఉత్సవమూర్తు లను కోలాటాలు, రామభక్తుల రామ నామస్మరణ, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. మండపం లోని రజత సింహాసనంపై సీతారాములను ఉంచి కల్యాణ క్రతువు ప్రారంభించారు. రామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించారు. భక్తుల జయ జయ ధ్వానాలు, రామనామ స్మరణ మధ్య తలంబ్రాల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుక అనంతరం భక్తులకు తలంబ్రాలను పంచారు.
నేడు పట్టాభిషేకం
కల్యాణ రాముడికి సోమవారం పట్టాభి షేకం జరగనుంది. మిథిలా స్టేడియంలోనే నిర్వహించే ఈ వేడుకకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరవుతున్నా రు. వారు స్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. గవర్నర్ రాక సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.