కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి, కమెడియన్ సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన మత్తు వదలరా 2(Mathu Vadalara 2). ఈ మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 13న) థియేటర్లలో రిలీజైంది. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది. చక్కటి ఫన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ క్రేజీ ఎంటర్ టైన్ మెంట్ ఎలాంటి నవ్వులు పంచిందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే::
మత్తు వదలరా 2 సినిమా కథ..మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది.డెలివరీ ఏజెంట్లు బాబు (శ్రీ సింహ), ఏసు (సత్య) ఉద్యోగాల వేటలో ఉంటారు. ఇక దొంగ దారిలో హీ టీమ్ (కిడ్నాప్ కేసులను డీల్ చేసే హైలీ ఎమర్జెన్సీ టీమ్)లో ఉద్యోగాలు సంపాదిస్తారు. అనుకోకుండా హాయ్ ఎమర్జెన్సీ టీమ్స్ రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయంలో లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కుంటారు.
Also Read:-కొత్త ప్రాజెక్ట్తో అంచనాలు పెంచేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్
అయితే వీరికి వచ్చే జీతం ఏ మాత్రం సరిపోకపోవడంతో ఒక కన్నింగ్ ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలో కిడ్నాపర్లకు ఇచ్చే డబ్బుల్లో కొంత మొత్తాన్ని తస్కరించడం మొదలు పెడతారు. ఇలా సాగిపోతున్న సమయంలో వీరి దగ్గరకు ఓ పెద్ద కేసు వస్తుంది. తన కుమార్తె కనిపించడం లేదని, కిడ్నాపర్లు రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, ఏసుకు చెబుతుంది దామిని (ఝాన్సీ). అయితే అదే అదనుగా ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వొద్దని, ఈ కేసును తాము పర్సనల్ గా డీల్ చేస్తామని చెబుతారు. ఆ క్రమంలో వాళ్లిద్దరూ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు.
బాబు, ఏసును కావాలనే మర్డర్ కేసులో ఇరికించినది ఎవరు? తేజస్వి తోట తన పేరును ప్రకాష్ (అజయ్)గా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ముందుగా ఒక కిడ్నాప్ కేసు కారణంగా ఆకాష్ (అజయ్) మర్డర్ కేసులో ఎలా ఫ్రేమ్ అవుతారు. అయితే అసలు ఆకాష్ ను చంపింది ఎవరు? మర్డర్ కేసులో ఇరుకున్న వారికి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలా సాయం చేసింది. ఇందులో హీ.టీం హెడ్ దీప(రోహిణి) పాత్ర ఏమిటి? హీరో యువ ('వెన్నెల' కిశోర్) పాత్ర ఎలాంటిది ? అసలు దామిని ఎవరు? అనే తదితర వివరాలు తెలియాలంటే మత్తు వదలరా మూవీని థియేటర్ లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే::
కిడ్నాపింగ్ డ్రామాతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ ఫన్ జోడించడం, కిడ్నాపింగ్ డ్రామాను సరికొత్తగా చూపించడం ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ విజువల్స్ తో ఆడియన్స్ లో ఆసక్తి పెంచుతూ వచ్చారు మేకర్స్. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా కూడా ఉండటం విశేషం.
సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే..మత్తు వదలరా 2' విషయంలో కామెడీ మీద ఎక్కువ ఆధారపడ్డారు రితేష్ రానా. ఈ సినిమాలో ట్విస్టులు లేవని కాదు..ఆ ట్విస్టుల కంటే కామెడీ ఎక్కువ వర్కవుట్ అయ్యింది. మధ్యలో లాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ సినిమా మొదలైన తర్వాత ఇంటర్వెల్ ముందు నుంచి కథలో వేగం పుంజుకోవడంతో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. హీరోతో పాటు సత్య అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవడం, ఆ కేసు నుంచి బయట పడడానికి చేసిన ప్రయత్నాలు కడుపుబ్బ నవ్విస్తాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే..ఫస్ట్ హాఫ్ అంతా బాబు, యేసులు కిడ్నాప్ ఆపరేషన్స్ చేయడంతో సాగి ఇంటర్వెల్ కి ముందు రియా హత్య కేసులో ఇరుక్కోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే...ఆ కేసుని బాబు, యేసు, నిధి కలిసి ఎలా సాల్వ్ చేసారు అని ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ ఆసక్తిగా సాగుతుంది. సెకండాఫ్‌లో కామెడీ డోస్ తగ్గింది.
ఎవరేలా చేశారంటే::
కమెడియన్ సత్య తనదైన కామెడీతో సినిమా మొత్తాన్ని భుజస్కందాల మీద నడిపించాడు అని చెప్పొచ్చు. సత్య నటన, నడక నుంచి మొదలు పెడితే ఆయన ఎక్స్‌ప్రెషన్స్ వరకు ప్రతిదీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
ఇక చిరంజీవి తరహాలో సత్య వేసిన డ్యాన్స్, ఆ విజువల్స్ థియేటర్లలో ఆడియన్స్ చేత విజిల్స్ వేయించడం మాత్రం గ్యారంటీ అని చెప్పొచ్చు. యేసుదాసు పాత్రలో సత్య అదరగొట్టేశాడని చెప్పొచ్చు.
శ్రీ సింహ, సత్య ఆమధ్య వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఫరియా అబ్దుల్లా హీరోయిన్ పాత్రలో భలే సాలిడ్ గా కనిపించింది. సునీల్, వెన్నెల కిషోర్ కూడా తమ కామెడీతో తమదైన శైలిలో నవ్వించారు. రోహిణి, రాజా మిగతా నటీనటులు తమ పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు::
డైరెక్టర్ రితేష్ రానా ప్రేక్షకులని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ సాంగ్స్ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంపాక్ట్ గా ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. కెమెరా పనితనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి