హంస వాహన సేవ ట్రయల్​ రన్

హంస వాహన సేవ ట్రయల్​ రన్

భద్రాచలం, వెలుగు : ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా  22న సాయంత్రం 6 గంటలకు గోదావరిలో నిర్వహించే శ్రీసీతారామచంద్రస్వామి తెప్పోత్సవం హంసవాహన సేవ ట్రయల్​ రన్​ను మంగళవారం నిర్వహించారు. ఆలయ ఈవో ఎల్. రమాదేవి, ఏఎస్పీ పంకజ్​ పరితోష్​, నీటిపారుదల శాఖ ఈఈ రాంప్రసాద్, దేవస్థానం ఈఈ  వి.రవీందర్​రాజుతో పాటు అన్ని శాఖల అధికారులు హంసావాహనం ఎక్కి నదిలో తిరిగారు.

లోటుపాట్లను గుర్తించి పలు సూచనలు చేశారు. ర్యాంపు, హంసావాహనంపైకి ఒకేసారి ఎక్కువ మంది రాకుండా తీసుకోవాల్సినవి, లాంచీకి ఏర్పాటు చేసిన లైటింగ్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని ఏఎస్పీ పంకజ్​ పరితోష్​ తెలిపారు. నదీ ప్రవాహంపై ఇరిగేషన్​ ఈఈ రాంప్రసాద్​తో చర్చించారు.