భద్రాచలం, వెలుగు : శ్రీ సీతారామచంద్రస్వామి 26 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం ఆలయ అధికారులు లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.71లక్షల 22వేల 878, అన్నదాన హుండీల ద్వారా రూ. లక్షా 61 వేల 100, గోశాల హుండీల నుంచి రూ.లక్ష 95వేల363 వచ్చాయి. మొత్తంగా రూ.74,79,341 ఇన్కం వచ్చిందని ఆఫీసర్లు తెలిపారు.
ఇందులో 270 యూఎస్ డాలర్లు, 50 కెనడా డాలర్లు, 20 మలేషియన్ రింగిట్స్, 2000 వియత్నాం డాంగ్స్ వచ్చాయి. హుండీల ద్వారా వచ్చిన డబ్బులను ఈవో ఎల్.రమాదేవి బ్యాంకర్లకు అందజేశారు. చివరి సారిగా ఫిబ్రవరి 29న హుండీలు తెరిచి లెక్కించారు.