మహంకాళి ఆలయ హుండీ లెక్కింపు

 మహంకాళి ఆలయ హుండీ లెక్కింపు
  • నెల రోజుల ఆదాయం రూ.14.07 లక్షలు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ హుండీ లెక్కింపును శుక్రవారం చేపట్టారు. నెల రోజుల కాలానికి అమ్మవారి హుండీ ఆదాయం మొత్తం రూ.14 .07 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస శర్మ, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్లు సురిటికామేశ్వర్, రామేశ్వర్, మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ కేఎం కృష్ణ, పిల్లి ప్రకాశ్, గౌరీ శంకర్  పాల్గొన్నారు.