![గోపాలపల్లిలో వైభవంగా వారిజాల వేణుగోపాల స్వామి కల్యాణం](https://static.v6velugu.com/uploads/2025/02/sri-varijala-venugopala-swamy-wedding-celebrated-in-gopalapalli_KUC8Ve4Lub.jpg)
- .పాల్గొన్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి
నార్కట్ పల్లి వెలుగు: నల్లగొండ జిల్లా నార్కట్పల్లిమండల పరిధిలోని గోపాలపల్లి సమీపంలో వారిజాల వేణుగోపాల స్వామి కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. దేవాలయం ప్రధాన అర్చకులు మచ్చ గిరి, కారంపూడి కృష్ణమాచార్యులు, దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ కోమటి రెడ్డి మోహన్ రెడ్డి కల్యాణానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వేణుగోపాలస్వామి దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉందని, ప్రపంచంలో ఎంత కరువు ఉన్నా ఈ కోనేరులో మాత్రం నిత్యం నీరు ఉంటుందన్నారు.
ఈ దేవస్థానాన్ని , చెరువుగట్టు దేవస్థానాన్ని ప్రభుత్వం తరఫున మరింత అభివృద్ధి చేస్తామని. ఈ దేవస్థానానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టుని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 80శాతం పూర్తయిన ప్రాజెక్టులను కేసీఆర్ పక్కన పెట్టడం వల్లనే ప్రజల పాపం తలిగి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉషయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి, వడ్డె భూపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ భద్రాచలం,పుల్లెంల అచ్చాలు,దూదిమెట్ల సత్తయ్య పాల్గొని కళ్యాణం తిలకించారు. తలంబ్రాల బియ్యం ని వచ్చిన భక్తులు దేవుడు కివసమర్పించారు. కళ్యాణం లో దాదాపు 100 మంది దంపతులు పాల్గొన్నారు.