
బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ వర్ధమాన్ జైన్ టీటీడీలోని పలు ట్రస్టులకు రూ. 43 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ మేరకు విరాళం డీడీలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు 33 లక్షలా 33 వేల రూపాయలు, ఎస్వీబీసీ ట్రస్టుకు 10 లక్షలా 11 వేల రూపాయలు అందించారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టైమ్ స్లాట్ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 14 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. క్యూకాంప్లెక్స్‌లో 20 కంపార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న (సోమవారం) 64,741 మంది స్వామివారిని దర్శించుకోగా 24,667 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.82 కోట్లు సమర్పించారు.