కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైభవంగా వేంకటేశ్వరుని శోభాయాత్ర

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైభవంగా వేంకటేశ్వరుని శోభాయాత్ర

కరీంనగర్ సిటీ,  ఫొటోగ్రాఫర్ వెలుగు : కళాకారుల ఆట పాటలు.. వేషధారణలు.. కోలాట నృత్యాలు, భజనలు, ఒగ్గుడోలు, బోనాలు, గుర్రాలు, ఒంటెలతో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీ వేంకటేశ్వరుడి శోభాయాత్ర సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. తొమ్మిది మంది దేవతమూర్తులు ఆసీనులు కాగా రంగురంగుల విద్యుత్‌‌‌‌‌‌‌‌ లైట్లతో అలంకరించిన రథంపై వేంకటేశ్వర స్వామిని ఊరేగించారు. రాంనగర్ మార్క్ ఫెడ్ మైదానం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర మంకమ్మతోట, గీతాభవన్ చౌరస్తా , బస్టాండ్ మీదుగా వేంకటేశ్వర ఆలయం వరకు సాగింది. 

శోభాయాత్రలో పాల్గొనేందుకు సిటీవాసులు భారీగా తరలివచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆలయ ఈవో సుధాకర్, ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్ పాల్గొన్నారు.