
హుషారు(Husharu) సినిమా సూపర్ హిట్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు దర్శకుడు శ్రీ హర్ష కనుగంటి. ఈ సినిమా తరువాత ఏకంగా దిల్ రాజు బ్యానర్ లో రౌడీ బాయ్స్ అనే సినిమా చేశాడు. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం భీమ్ బుష్(Om Bheem Bush) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్టైనర్ గా వస్తుందని ఫస్ట్ లుక్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. విలేజ్‌లో వ్యోమగాముల పాత్రల్లో కనిపిస్తున్న శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ ఫన్నీగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేస్తోంది. మార్చ్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Introducing my gang of bang bros with the 𝐍𝐄𝐖 𝐌𝐀𝐍𝐓𝐑𝐀 𝐎𝐅 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐌𝐄𝐍𝐓 - #OmBheemBush - No Logic Only Magic 🪄
— Sree Vishnu (@sreevishnuoffl) February 22, 2024
Grand release worldwide on March 22nd 💫@PriyadarshiPN @eyrahul @HarshaKonuganti @SunnyMROfficial @SunilBalusu1981 #RajThota @vijaycuts… pic.twitter.com/uVjtex6CzT