మే 9న రిలీజ్ కి సిద్ధంగా శ్రీవిష్ణు సింగిల్‌‌‌‌

మే 9న రిలీజ్ కి సిద్ధంగా శ్రీవిష్ణు సింగిల్‌‌‌‌

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సింగిల్‌‌‌‌’.  కేతిక శర్మ, ఇవాన హీరోయిన్స్‌‌‌‌.  కార్తీక్ రాజు దర్శకుడు.  మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది. ‘మనకు గర్ల్స్‌‌‌‌ వద్దు మావా.. నాకు నువ్వు నీకు నేను’ అంటూ పగటిపూట వెన్నెల కిషోర్‌‌‌‌‌‌‌‌కి ఫ్రెండ్‌‌‌‌షిప్‌‌‌‌ కొటేషన్స్‌‌‌‌ చెప్పే శ్రీవిష్ణు.. రాత్రయితే ఇద్దరు హీరోయిన్స్‌‌‌‌తో రొమాన్స్‌‌‌‌ చేస్తున్నట్టుగా దీన్ని డిజైన్ చేశారు. 

విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని  అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌‌‌‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.