హైదరాబాద్, వెలుగు: శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్ తమ బిజినెస్‌ను మరింతగా విస్తరించడానికి సిద్ధమయ్యింది. పశ్చిమగోదావారి జిల్లా, నల్లజర్ల మండలంలోని అవపాడు గ్రామంలో 2014 లో మొదలైన ఈ కంపెనీ, ఆదివారంతో పదేళ్లు పూర్తి చేసుకుంది. పాడి రైతులు, వినియోగదారుల సపోర్ట్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించింది.
ప్రస్తుతం 18 పాల శీతలీకరణకేంద్రాలు, టెట్రాప్యాక్కింగ్ మిషినరీలను ఆపరేట్ చేస్తోంది. 25 వేలకు పైగా కుటుంబాలకు, వెయ్యికి పైగా రెస్టారెంట్లకు, అనేక ప్రభుత్వ, ప్రేవేటు విద్యాసంస్థలకు పాలను సరఫరా చేస్తోంది. గత పదేళ్లలో రూ. 200 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ సాధించామని, లక్ష మందికి పైగా ఉపాధి, ఉద్యోగాలను కల్పించామని శ్రీచక్ర మిల్క్ ప్రొడక్ట్స్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.