తెలంగాణకు రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణకు  రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు

రానున్న 4ఏళ్లలో ఐటీ రంగంలో విస్తృత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెట్టుబడులు తెచ్చేనందుకు కృషి చేస్తున్నామన్నారు. కొత్త పాలిసీలు తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎక్సిబిషన్ సెంటర్ లో మే 17వ తేదీ శుక్రవారం 2వ ఎడిషన్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు శ్రీధర్ బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..  గ్రీన్ బిల్డింగ్ ప్రొపర్ టి షో నిర్వహకులకు అభినందనలు తెలిపారు.  ఆధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐటీ రంగంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. దీనివల్ల ఉద్యోగాలతో పాటు.. పరోక్షంగా ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. సులభతర వాణిజ్య విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెట్టుబడిదారులకు, నిర్మాణ సంస్థలు, స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని తెలిపారు.  ప్రతి పౌరుడు లబ్ధి పొందే విధంగా ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

 నిర్మాణ రంగంలో హరిత భవనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి అన్నారు.  హరిత భవనాల గురించి కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు అవగాహన కల్పించాలని చెప్పారు. 2003లో హరిత భావనాల నిర్మాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైందని తెలిపారు. 20ఏళ్లలో క్రమంగా హరిత భవనాల నిర్మాణం జరిగితూ వస్తోందని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ వినియోగంపై అప్పటి మన్మోహన్ సర్కారు కఠిన చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారాయన.  పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేదుకు ఆకస్మిక తనిఖీలు చేశానని గుర్తు చేశారు. కర్భన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీధర్ బాబు అన్నారు. పిలుపునిచ్చారు.