తెలంగాణ శాసన మండలిలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఆయన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ ప్రతులను అందజేశారు. కాగా, శుక్రవారం మండలి సమావేశం కావడం లేదు. సభ్యులు బడ్జెట్‌పై ప్రిపేర్ అయ్యేందుకు ఒకరోజు సమయం ఇచ్చారు.
శనివారం బడ్జెట్‌పై జనరల్ డిస్కషన్ జరగనుంది. దాంతో పాటు ఫైనాన్షియల్ స్టేట్మెంట్పై భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ఆదివారం బోనాల సెలవు కాగా.. సోమ, మంగళవారం కూడా మండలి సమావేశం కావడం లేదు. బుధవారం అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.