త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అసెంబ్లీలో యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీ బిల్లును ప్రవేశ పెట్టిన శ్రీధర్ బాబు.. జాబ్ క్యాలెండర్ ప్రకారం రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలంటే సాధ్యం కాదని చెప్పారు. ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధిని కల్పిస్తామని చెప్పారు. టీజీపీఎస్ పీఎస్ నీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశామని తెలిపారు
Also Read :- గద్వాల్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన మంత్రి
ఖాళీలను భట్టి ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు శ్రీధర్ బాబు. యువత స్కిల్ గ్యాప్ ను ఫిల్ చేస్తామన్నారు. పలు శాఖల్లో ఉద్యోగాలను నింపుతామని చెప్పారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు గ్రాడ్యువేట్లలో కొరవడ్డాయన్నారు. నైపుణ్యాల పెంపుపై పారశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామన్నారు. అన్నికోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ ను కల్గి ఉంటాయని వెల్లడించారు.స్కిల్ వర్శిటీతో ఆర్థిక వృద్ధి పెరుగుతుందన్నారు. స్కిల్ వర్శిటీతో యువతకు ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 2500 మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు.. ముచ్చెర్లలో స్కిల్ వర్శిటీ కోసం పర్మినెంట్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు శ్రీధర్ బాబు.