మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ .. జీవో తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ .. జీవో తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

మూసీ ప్రక్షాళనపై విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు.   మూసీ రివర్  ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు.  2017లోనే మూసీ రివర్ ప్రంట్ కార్పొరేషన్  ఏర్పాటు  చేశారని  చెప్పారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్  నిర్ణయించారని.. దీని కోసం జీవో నెంబర్ 7 తెచ్చారని వెల్లడించారు. మూసీకి ఎఫ్ టీఎల్,  బఫర్ జోన్ ఫిక్స్ చేయాలని2020 జూన్ 25న  కేటీఆర్ ఆదేశించారని చెప్పారు శ్రీధర్ బాబు.

ALSO READ | హైడ్రా హైడ్రోజన్ బాంబు లాంటిది..పేదోడి జోలికొస్తే ఊరుకోం: ఎమ్మెల్యే కూనంనేని

మూసీలో అక్రమ కట్టడాలను గుర్తించాలని..  బఫర్ జోన్ గుర్తించాలని ఆనాడు కేసీఆర్  ఆదేశించలేదా? మూసీని కాలుష్య రహితంగా   చేస్తామని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు శ్రీధర్ బాబు. 2021, 2022లో మూసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం సమావేశాలు పెట్టిందన్నారు శ్రీధర్ బాబు.  మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. బీఆర్ఎస్ నేతలు గతంలో చేసిన పనులు మర్చిపోయినట్టున్నారని  అన్నారు.  పేదలు,మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని తెలిపారు శ్రీధర్ బాబు.