జినోమ్ వ్యాలీలో పరిశ్రమలను ప్రారంభించిన శ్రీధర్ బాబు

జినోమ్ వ్యాలీలో పరిశ్రమలను ప్రారంభించిన శ్రీధర్ బాబు

హైదరాబాద్​, వెలుగు: నగర శివారులోని జినోమ్ వ్యాలీలో ఐటీ, పరిశ్రమల మంత్రి  శ్రీధర్ బాబు రూ.3,000 కోట్లకు పైబడిన పెట్టబడులతో ఏర్పాటు చేసిన ఫార్మా, ఆర్ అండ్ సెంటర్, మౌలిక సదుపాలయాల కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. లారస్ లేబరెటరీస్ యూరప్​కు చెందిన కేఆర్​కేఏ అనే బహుళ జాతి సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన ఆర్​ అండ్​ డీ సెంటర్​ను ఆరంభించారు. లారస్ వచ్చే నాలుగేళ్లలో ఈ సదుపాయంలో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 2800 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 3జీవీ అనే భవనాల సముదాయాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. 

ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే పలు  ద్వారా  దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. రూ.700 కోట్ల పెట్టుబడితో, 8.5 ఎకరాలల్లో బయోపొలిస్ అనే సంస్థ ఏర్పాటు చేయనున్న భవన సముదాయానికి మంత్రి శంకుస్థాపన చేసారు.  ఇందులో ప్రయోగశాలు, ఆర్ అండ్ డీ సెంటర్లు ఉంటాయి.  అనంతరం శ్రీధర్ బాబు జినోమ్ వ్యాలీ అభివృద్ది, విస్తరణపై 30 పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించారు. ఇందులో భారత్ బయోటెక్, సింజీన్, బయోలాజికల్- ఈ, జేఏఎంపీ లాంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఉన్నారు.