
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (టీబీఏ) ప్రెసిడెంట్‌గా రావుల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం (ఏప్రిల్ 1) హైదరాబాద్‌లో టీబీఏ కొత్త కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్స్‌గా చంద్ర మోహన్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, - అబ్దుల్ హఫీజ్ ఖాన్, విజయసారథి ఎన్నికయ్యారు.
జనరల్ సెక్రటరీగా పృథ్వీశ్వర్ రెడ్డి, ట్రెజరర్‌గా చంద్రశేఖర్ ఎంపికవ్వగా.. జాయింట్ సెక్రటరీలుగా విష్ణు కుమార్ గౌడ్, మహ్మద్ సమియుద్దీన్, అసోసియేట్ సెక్రటరీలుగా సుకుమార్ ఫ్రాన్సిస్, నస్రుల్లా హైడర్ ఎన్నికయ్యారు. ఈ ఎలక్షన్స్‌కు జస్టిస్ పి. నవీన్ రావు రిటర్నింగ్ ఆఫీఫర్‌గా వ్యవహరించారు. కొత్త కార్యవర్గం నాలుగేండ్ల పాటు పదవిలో ఉంటుంది.
తెలంగాణలో బాస్కెట్‌బాల్ అభివృద్ధి కోసం కొత్త టీమ్‌తో కలిసి పని చేస్తానని, ఈ ఆటలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని శ్రీధర్ రెడ్డి తెలిపారు.