నిర్మల్లో కేటీఆర్ హెలిప్యాడ్ వద్ద శ్రీహరి రావు ఆందోళన

నిర్మల్, వెలుగు: 14 ఏండ్ల నుండి కొనసాగుతూ ఇప్పటికీ పూర్తికాని కాళేశ్వరం హై లెవెల్ కాలువ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి కేటీఆర్ ఎలా ప్రారంభిస్తారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీహరి రావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్రీహరిరావు ఏకంగా హెలిపాడ్ వద్దకే చేరుకొని బీఆర్ఎస్​కు, మంత్రి కేటీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేవలం ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కాళేశ్వరం లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నారని ఫైర్ ​అయ్యారు.

ఇప్పటికీ 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. అలాంటి పథకాన్ని అదరాబాదరాగా ప్రారంభించడం వెనక కారణమేమిటని ప్రశ్నించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని శ్రీహరిరావుతో పాటు మరి కొంత మంది పార్టీ కార్యకర్తలను బలవంతంగా సారంగాపూర్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.