హుజూర్ నగర్, వెలుగు: కేంద్రం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును వెంటనే అమలు చేయాలని మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన డిమాండ్ చేశారు. సోమవారం హుజూర్ నగర్ టౌన్ కౌన్సిల్‌లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దేవరం సుజాత అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
మహిళా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపినా ఐదేళ్ల తర్వాత అమలు చేస్తామని చెప్పడం సరికాదని, ఓట్ల కోసమే బిల్లు తెచ్చినట్లు అనిపిస్తోందని ఆరోపించారు. ఓబీసీ సబ్ కమిటీల వారికి రిజర్వేషన్ కల్పించి.. వచ్చే ఎన్నికల్లో అమలు చేయాలని కోరారు. ఈ బిల్లుకు మహిళా బిల్లు అమలు కమిటీలో చైర్మన్ గా పనిచేసిన గీతా ముఖర్జీ పేరును పెట్టాలని కోరారు.