
వెన్నెల కిషోర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. అనన్య నాగళ్ల హీరోయిన్. రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నపూస రమణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో వెన్నెల కిషోర్ డిటెక్టివ్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచాడు. శియా గౌతమ్ మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.