
ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పిఏ రవి సూసైడ్ చేసుకున్నారు. ఎమ్మెల్యేకు ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్న రవి తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు. డిసెంబర్ 27 రాత్రి తన ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరాదీస్తున్నారు.