నా బెస్ట్ ఫేజ్‌కు చేరుకుంటా ఇండియా స్టార్ షట్లర్‌‌ కిడాంబి శ్రీకాంత్‌

హైదరాబాద్, వెలుగు: తన కెరీర్‌‌లో అత్యుత్తమ దశకు చేరుకునేందుకు కృషి చేస్తానని ఇండియా స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ తెలిపాడు. ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, ఇండోనేసియా ఓపెన్‌తో తిరిగి బరిలోకి దిగుతానని చెప్పాడు. ప్రముఖ  స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్‌ బ్రాండ్ అయిన ‘హండ్రెడ్’లో  భాగస్వామిగా చేరిన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  శ్రీకాంత్ మాట్లాడాడు. ‘నేనిప్పుడు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నా.

ఎలాంటి గాయం లేదు. ఇండోనేసియా ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో పాల్గొంటాను. నేను నా బెస్ట్ ఫేజ్‌ను ఇంకా చేరుకోలేదు. దాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తా. అందుకోసం నిరంతర ప్రాక్టీస్‌తో నా ఆటను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటా’ అని శ్రీకాంత్ చెప్పాడు.   రిటైర్‌‌ అయిన తర్వాతే అకాడమీ పెట్టడం,  కోచ్‌గా మారే ఆలోచన చేస్తానని తెలిపాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ‘హండ్రెడ్‌’ ఇండియా డైరెక్టర్ విశాల్ జైన్‌తో కలిసి ఆ  బ్రాండ్ రూపొందించిన తన జెర్సీని శ్రీకాంత్ ఆవిష్కరించాడు.