
నారాయణ్ ఖేడ్, వెలుగు : తెలంగాణ ఉద్యమం మలిదశలో అమరుడైన శ్రీకాంత్ చారి విగ్రహాన్ని నారాయణఖేడ్ పట్టణంలోని మంగళ పేట్‌లో బుధవారం ఆవిష్కరించారు. విశ్వకర్మ నాయకులు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని లెక్కచేయకుండా అమరుడయ్యాడని కొనియాడారు. ఈ ఘటనతోనే ఉద్యమం ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిందన్నారు.
శ్రీకాంత్ చారి ఆశయ సాధన కోసం నాయకులు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, ఓబీసీ జాతీయ కమిషన్ సభ్యులు తల్లోజి ఆచార్య, కాసోజు శంకరమ్మ, కవలే జగన్నాథం, జైన్ కుమార్ విశ్వకర్మ తదితరులు పాల్గొన్నారు.