లేటు వయసులో రెండో పెళ్లికై ఆరాటం.. హింట్ ఇచ్చి డిలీట్ చేశాడు

శ్రీకాంత్ అయ్యంగార్(Srikanth ayyangar).. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈ మధ్య టాలీవుడ్ లో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లో కనిపించారు ఈ నటుడు. రీసెంట్ గా శ్రీ విష్ణు(Sree vishnu) హీరోగా వచ్చిన సామజవరగమనా(Samajavaragamana) సినిమాతో హిట్ అందుకున్న ఈ నటుడు.. కార్తికేయ(Karthikeya) హీరోగా వచ్చిన బెదురులంక 2012(Bedurulanka)తో మరో హిట్ అందుకున్నారు. ఇలా వరుస హిట్ సినిమాలు చేస్తూ కెరీర్ లో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు శ్రీకాంత్ అయ్యంగార్. 

కేవలం సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులంతో టచ్ లోనే ఉంటూఉంటారు. ఇందులో భాగంగానే శ్రీకాంత్ తాజాగా లేడీ ఫోటోగ్రాఫర్ ఎలీ అనే యువతీతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాల ఖాతలో షేర్ చేసి వెంటనే డిలీట్ చేశాడు.  షేర్ చేశాడు. అంతేకాదు దానికి.. మై లవ్.. ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను.. అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. 

ఈలోపే ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. దీంతో శ్రీకాంత్ ఆమెపై మనసుపారేసుకున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమెను రెండో పెళ్లి చేసుకోనున్నారు అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. నిజానికి శ్రీకాంత్ కు ఇప్పటికే పెళ్లి అయ్యి విడాకులు అయ్యాయి. ప్రస్తుతం ఆయన సింగిల్ గా ఉంటున్నాడు. ఈ క్రమమలోనే ఆయన రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అందుకే ఇలాంటి హింట్స్ ఇస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి శ్రీకాంత్ ఆ ఫోటోను ఎందుకు డిలేట్ చేశాడు? రెండో పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.